నేడే దాదా చేతికి పగ్గాలు.. 

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-23 11:54:57

img

బెంగాల్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ నేడు బిసిసిఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈరోజు సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో కొత్త అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపడతారు. 33 నెలల పాటు బీసీసీఐని నడిపించిన సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోనుంది.

గంగూలీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ధోని భాష్యత్తు గురించి ధోనితోనూ, అలానే సెలక్టర్లతోను మాట్లాడే అవకాశం ఉంది. గంగూలీ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడం గొప్ప విషయం. అతణ్ని అభినందించాను. కానీ ధోని గురించి తనతో ఇంకా ఏమీ మాట్లాడలేదు. నాతో మాట్లాడాలనుకుంటే కచ్చితంగా వెళ్లి కలుస్తాను అని టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD