నేడే బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రారంభం

Nava Telangana

Nava Telangana

Author 2019-11-04 09:21:00

హైదరాబాద్: బయోడైవర్సిటీ జంక్షన్‌లో మెహిదీపట్నం నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ఫ్లై ఓవర్ సోమవారం ప్రారంభంకానుంది. పురపాలకశాఖ మంత్రి కే.టీ.రామారావు ముఖ్యఅతిథిగా హాజరై ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం వల్ల ఖాజాగూడ నుంచి మైండ్‌స్సేస్ వైపు వెళ్లే ట్రాఫిక్‌కు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా బయోడైవర్సిటీ జంక్షన్‌లో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. అందులో ప్రస్తుతం రూ.69.47కోట్ల వ్యయంతో మెహిదీపట్నం-ఖాజాగూడ మార్గంలో చేపట్టిన సెకెండ్ లెవల్ ఫ్లైఓవర్ సిద్ధమైంది. ఈ మూడు లేన్ల ఫ్లైఓవర్‌తో ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు పరిష్కారమవుతాయి.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN