నేను చేసిన తప్పును రోహిత్ చేయడనుకుంటున్నా: లక్ష్మణ్

Nava Telangana

Nava Telangana

Author 2019-09-28 23:37:00

విశాఖపట్టణం: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా వచ్చే నెల 2న భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. టెస్టుల్లో ఇప్పటి వరకు మిడిల్ ఆర్డర్‌లో ఆడిన రోహిత్.. దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. వన్డేలు, టీ20ల్లో ఓపెనర్‌గా దిగుతున్న రోహిత్‌కు ఇది చాలెంజింగ్ విషయమే. వీవీఎస్ లక్ష్మణ్ కూడా టెస్టుల్లో తొలుత మిడిల్ ఆర్డర్‌లో ఆడి ఆ తర్వాత ఓపెనర్‌గా స్థిరపడ్డాడు. మిడిల్ ఆర్డర్‌లో విజయవంతంగా బ్యాటింగ్ చేసిన తాను తన మైండ్ సెట్‌ను మార్చుకుని పెద్ద తప్పు చేశానని పేర్కొన్న లక్ష్మణ్.. అదే తప్పును రోహిత్ చేయడని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. సీనియర్ ఆటగాళ్లు, మాజీ ఓపెనర్లు, కోచ్‌లతో మాట్లాడిన తర్వాత ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కోవాలంటే టెక్నిక్‌ను మార్చుకోవాల్సి ఉంటుందని వారు చెప్పారని గుర్తు చేసుకున్నాడు. వారిని కలిసిన తర్వాత తన బ్యాటింగ్‌లో అనూహ్యమైన మార్పు వచ్చిందని పేర్కొన్నాడు. కాబట్టి ఓపెనర్‌గా రాణించాలంటే మానసిక క్రమశిక్షణ అవసరమని చెప్పుకొచ్చాడు. ఆఫ్‌ సైడ్ వెళ్లే బంతులను వదిలివేయడమే ఉత్తమమని సూచించాడు. అయితే, సహజ సిద్ధమైన ఆటతీరులో అవసరానికి మించి మార్పులు చేసుకుంటే మాత్రం అనుకున్న ఫలితాలు రావని లక్ష్మణ్ వివరించాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN