పంజాబ్‌ చీఫ్‌ కోచ్‌గా కుంబ్లే

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-12 06:47:23

img

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే మళ్లీ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. గతంలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన కుంబ్లే.. ఈసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో శిక్షణ ఇవ్వనున్నాడు. వచ్చే సీజన్‌లో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ జట్టుకు అనిల్‌ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పంజాబ్‌ జట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. కుంబ్లే గతంలో బెంగళూరు, ముంబై జట్లకు మెంటార్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక.. భారత మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషి పంజాబ్‌ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈనెల 19న కుంబ్లే జట్టు బాధ్యతలు తీసుకోనున్నాడు. కాగా.. పంజాబ్‌ జట్టు కెప్టెన్‌గా అశ్విన్‌ను కొనసాగించాలా? వద్దా అన్నది కూడా అదేరోజు తేలనుంది. అంటే.. గత రెండు సీజన్లలో జట్టును సమర్ధంగా నడిపించడంలో విఫలమైన అశ్విన్‌ కెప్టెన్సీ భవితవ్యాన్ని ఇప్పుడు కుంబ్లే నిర్ణయించనున్నట్టు తెలిసింది. అంతేకాదు.. జట్టులోకి ఏ ఆటగాడిని తీసుకోవాలి, ఎవరిని విడుదల చేయాలన్న అంశాన్ని కూడా యాజమాన్యం కుంబ్లే ఇష్టానికే వదిలేసినట్టు పంజాబ్‌ ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD