పంత్‌పై విమర్శలు వద్దు: రోహిత్

Mana Telangana

Mana Telangana

Author 2019-11-03 12:29:02

img

న్యూఢిల్లీ: యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు టీమిండియా తాత్కాలికా కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగే తొలి టి20 మ్యాచ్‌ను పురస్కరించుకుని రోహిత్ శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రోహిత్ పలు విషయాలు వెల్లడించాడు. పంత్ కెరీర్ ప్రారంభించి ఎక్కువ కాలం కాలేదని, అయినా అతనిపై కొందరూ పనిగట్టుకుని విమర్శలకు దిగడం మంచిది కాదని హితవు పలికాడు. పంత్‌లో అపార ప్రతిభ దాగివుందని, కాస్త సమయం ఇస్తే మెరుగైన ఆటగాడిగా ఎదుగుతాడని ధీమా వ్యక్తం చేశాడు. ఒకటి రెండు సార్లు విఫలమైనంత మాత్రాన పంత్‌ను తక్కువ చేసి చూడడం తగదన్నాడు.

రానున్న రోజుల్లో భారత కీలక ఆటగాళ్లలో ఒకడిగా పంత్ ఉంటాడనే నమ్మకం తనకుందన్నాడు. ఇక, బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపికైన మరో వికెట్ కీపర్ సంజు శాంసన్ కూడా ప్రతిభావంతుడేనన్నాడు. అతను కూడా టీమిండియాలో చోటుకు అర్హుడేనన్నాడు. ఇక, బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టి20లో ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందో ముందే చెప్పలేమన్నాడు. అయితే పంత్‌కే మెరుగైన అవకాశాలున్నాయని రోహిత్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన పంత్ చెలరేగితే ఆపడడం ప్రత్యర్థి బౌలర్లకు చాలా కష్టమన్నాడు.

ఇక, బంగ్లాతో జరిగే తొలి మ్యాచ్‌లో గెలుపే లక్షంగా పెట్టుకున్నామన్నాడు. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో టీమిండియా సమతూకంగా ఉందన్నాడు. ఇక, ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం లేదన్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌ను తాము తేలిగ్గా తీసుకోవడం లేదని రోహిత్ స్పష్టం చేశాడు. ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన బంగ్లాదేశ్‌కు తక్కువ అంచనా వేయలేమన్నాడు. తమదైన రోజు ఎంత పెద్ద జట్టునైనా ఓడించే సత్తా బంగ్లా సొంతమన్నాడు. గతంలో పలుసార్లు ఇలాంటి సంచలన విజయాలను బంగ్లాదేశ్ సాధించిందని రోహిత్ గుర్తు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు చాలా బలంగా ఉందన్నాడు. సమష్టిగా ఆడి సిరీస్‌ను సొంతం చేసుకోవడం తమ ప్రధాన లక్షమన్నాడు. దీని కోసం ప్రతి ఆటగాడు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాడని రోహిత్ వివరించాడు.

Too early to pass judgement on Rishabh Pant

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD