పట్టు బిగించిన కోహ్లీ సేన

Prajasakti

Prajasakti

Author 2019-10-06 11:17:17

img

- దక్షిణాఫ్రికా లక్ష్యం 395 బ ప్రస్తుతం 11/1
(ప్రజాశక్తి స్పోర్ట్స్‌ డెస్క్‌)
దక్షిణాఫ్రికాకు 395 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. శనివారం నాల్గో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ను భారతజట్టు 323/4 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. నాల్గోరోజు మరో అరగంట ఆట మాత్రమే మిగిలి ఉండగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు ఎల్గర్‌ వికెట్‌ను కోల్పోయి 11 పరుగులు చేసింది. చివరిరోజు టీమిండియా బౌలర్లు చెలరేగి మరో 9 వికెట్లు కూలిస్తే విజయం ఖాయం కానుంది. అంతకుముందు దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులవద్ద ఆలౌట్‌ చేయడంతో 71 పరుగుల ఆధిక్యత భారత్‌కు లభించింది.
ఓవర్‌నైట్‌ స్కోరు 8 వికెట్ల నష్టానికి 385 పరుగులతో శనివారం నాల్గోరోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 46 పరుగులు జోడించిన తర్వాత మిగతా రెండు వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ ఆటగాడు కేశవ్‌ మహరాజ్‌(9) తొమ్మిదో వికెట్‌గా ఔటయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. చివరి వికెట్‌గా కగిసో రబడా(15) ఔట్‌ కావడంతో సఫారీల ఇన్నింగ్స్‌ ముగిసింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు దక్షిణాఫ్రికా జట్టు 2013 తర్వాత భారత్‌లో రెండోసారి బ్యాటింగ్‌ చేస్తూ 400 పైచిలుకు పరుగులు చేసిన జట్టుగా రికార్డు నిలకొల్పింది. భారత్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌ చేసి, పర్యాటక జట్టు ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసి 400 పైచిలుకు పరుగులు చేసిన దాఖలు లేవు. ఇప్పుడు ఆ రికార్డును దక్షిణాఫ్రికా నెలకొల్పింది.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేసిన యువ క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత రోహిత్‌కు జత కలిసిన పుజారా ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ మంచి బంతుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ లయ తప్పిన బంతుల్ని మాత్రం బౌండరీలు దాటించారు. ఈ జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

స్కోర్‌ బోర్డు... సంక్షిప్తం
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 502/7డిక్లేర్డ్‌
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : 432 ఆలౌట్‌
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 323/4 డిక్లేర్డ్‌
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌:
(9 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి) 11 పరుగులు

సహజశైలికి భిన్నంగా...
చతేశ్వర పుజరా తన సహజశైలికి భిన్నంగా ఆడి అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. తొలుత కుదురుగా ఆడిన పుజరా.. ఆపై తన శైలికి భిన్నంగా బౌండరీల మోత మోగించాడు. పుజారా అర్ధ సెంచరీ సాధించే క్రమంలో 9 ఫోర్లు, 1 సిక్స్‌ సాధించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. పుజారా 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఫోర్‌ కొట్టి మరీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. పుజారా అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడానికి 42 పరుగులు 'బౌండరీ'ల రూపంలోనే సాధించాడు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(127), రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం పూర్తి చేసుకున్నాడు. పుజరా(81) పరుగులు చేయగా... జడేజా (40), కోహ్లీ(31), రహానే(27) దూకుడుగా ఆడారు.

రికార్డుల రోహిట్‌
టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన వరుస రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీల మోత మోగించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు రోహిత్‌ శర్మ. ఒక టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన రికార్డునూ లిఖించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ కెప్లర్‌ వెసెల్స్‌(208) పేరిట ఉండగా దాన్ని రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో రోహిత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు సాధిస్తే, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు సాధించి ఔటయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్‌ 303 పరుగులు చేయడం గమనార్హం. ఇప్పటికే మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి ఓ టెస్టులో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును లిఖించిన రోహిత్‌ శర్మ... తాజాగా వ్యక్తిగతంగా ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన రోహిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో సిక్స్‌ సాధించిన తర్వాత అరుదైన రికార్డును లిఖించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా ఘనతను సాధించాడు.

imgimg
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN