పతకానికి ఎంతో.. దూరం

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-08 06:01:00

img

- ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మారని భారత్‌ ప్రదర్శన
- విజేతలకు మన అథ్లెట్లకు భారీ అంతరం- నమస్తే తెలంగాణ, క్రీడావిభాగం : ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ రెండేండ్లకోసారి వస్తున్నది.. పోతున్నది. ఇప్పటికి వరకు 17సార్లు ఈ ప్రపంచ సమరం జరిగితే అందులో భారత్‌ సాధించింది ఒక్క కాంస్య పతకమే. అదీ 2003లో లాంగ్‌జంప్‌ విభాగంలో అంజు బాబి జార్జ్‌ గెలిచిందే. దీన్నిబట్టే మన పరిస్థితి ఎంత దీనంగా ఉందో తెలుస్తున్నది. పతకాల్లో అమెరికా టాప్‌లో దూసుకెళ్తుంటే కెన్యా, జమైకా లాంటి అతిచిన్న దేశాలూ ప్రతీ చాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్నాయి. చాలామందికి పేర్లు కూడా తెలియని బహమస్‌, బోస్నియా, బుర్కినాఫాసో లాంటి దేశాలకు చెందిన అథ్లెట్లు పతకాలు పడుతున్నారు. ఈసారి దోహా వేదికగా జరిగిన చాంపియన్‌షిప్‌లోనూ పతకాల పట్టికలో అమెరికా (29) టాప్‌లో నిలువగా ఆఫ్రికాలోని చిన్న దేశాలైన కెన్యా (11), జమైకా (12) పతకాల పంట పడించినా.. మన 27మంది అథ్లెట్ల బృందం మాత్రం రిక్తహస్తాలతోనే వెనుదిరిగింది.

మిక్స్‌డ్‌ రిలే జట్టు, స్టిపుల్‌చేజ్‌లో అవినాశ్‌ టోక్యో ఒలింపిక్స్‌ (2020) బెర్త్‌లు దక్కించుకోవడం కాస్త సంతోషం కలిగించే అంశమైనా.. అన్నూరాణి, జబీర్‌ మినహా మిగలినవారంతా క్వాలిఫికేషన్‌ రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ఇక్కడ మరో అంశం దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. అసలు సమీప భవిష్యత్తులో చాంపియన్‌షిప్‌లో భారత్‌ స్వర్ణ పతకాన్ని సాధిస్తుందా అన్న అనుమానాలను బలపరుస్తున్నది. అదే ఈసారి వివిధ విభాగాల్లో స్వర్ణ పతక విజేతలకు.. మన అథ్లెట్ల ప్రదర్శనకు మధ్య గల భారీ అంతరం. పతకం గెలువకున్నా కనీస పోటీ లేకుండా తొలి అడుగులోనే నిష్క్రమించడం నిరాశ కలిగించే అంశం. దేశంలోని అథ్లెటిక్స్‌ పరిస్థితిని, ప్రోత్సహించాల్సిన అవసరాన్ని చాంపియన్‌షిప్‌ ఫలితాలు మరోసారి తేటతెల్లం చేస్తున్నాయి.
img

400మీటర్ల హర్డిల్స్‌

ఎంపీ జబీర్‌ (భారత్‌): హీట్స్‌లో 49.62 సెకన్లు, సెమీస్‌లో: 49.71 సెకన్లు (హీట్‌-3లో 5వ, ఓవరాల్‌గా 17వ స్థానం)
ధరుణ్‌ అయ్యస్వామి (భారత్‌): 50.55 సెకన్లు (హీట్‌-5లో 6వ, ఓవరాల్‌గా 27వ స్థానం)
స్వర్ణ పతక విజేత: కార్‌స్టెన్‌ వార్‌హోమ్‌ (నార్వే), 47.42 సెకన్లు

మారథాన్‌

గోపీ తనకల్‌ (భారత్‌): 2 గంటల 15.57 నిమిషాలు (21వ స్థానం)
స్వర్ణ విజేత: లీసా దెసీసా (ఇథియోపియా), 2గంటల 10.40 నిమిషాలు

3000 మీటర్ల స్టిపుల్‌ చేజ్‌

అవినాశ్‌ సేబల్‌ (భారత్‌): హీట్స్‌లో 8 నిమిషాల 25.23 సెకన్లు, ఫైనల్లో 8 నిమిషాల 21.37 సెకన్లు (13వ స్థానం)
స్వర్ణ పతక విజేత: సెన్సస్‌ కిప్రుటో (కెన్యా), 8 నిమిషాల 01.35 సెకన్లు

20 కిలోమీటర్ల రేస్‌ వాక్‌

ఇర్ఫాన్‌ తోడి (భారత్‌): గంటా 35.21 నిమిషాలు (27వ స్థానం)
దేవేందర్‌ సింగ్‌ (భారత్‌): గంటా 41.48 నిమిషాలు (36వ స్థానం)
పసిడి విజేత: తషికాజు యమనిషి (జపాన్‌), గంటా 26.34 నిమిషాలు

4 X 400 రిలే

భారత జట్టు (మహమ్మద్‌ అనస్‌, జాకోబ్‌, కేఎస్‌ జీవన్‌, నోవా నిర్మల్‌ టామ్‌) 3 నిమిషాల 03.09 సెకన్లు (హీట్‌-2లో 7వ, ఓవరాల్‌గా 12వ స్థానం)
స్వర్ణ విజేత: అమెరికా జట్టు, 2 నిమిషాల 56.69 సెకన్లు

షార్ట్‌పుట్‌

తేజీందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌ (భారత్‌): 20.43 మీటర్లు (క్వాలిఫికేషన్‌ గ్రూప్‌-బిలో 8వ, ఓవరాల్‌గా 18వ స్థానం)
స్వర్ణ పతక విజేత: జోయ్‌ కోవాక్స్‌ (అమెరికా), 22.91 మీటర్లు
img
జిన్సన్‌ జాన్సన్‌ (భారత్‌): 3నిమిషాల 39.86సెకన్లు (హీట్స్‌-2లో 10వ, ఓవరాల్‌గా 34వ స్థానం)
స్వర్ణ పతక విజేత: తిమోతి చెర్యోట్‌ (కెన్యా), 3 నిమిషాల 29.26 సెకన్లు
img

200 మీటర్ల పరుగు


అర్చన సుసీంద్రన్‌ (భారత్‌): 23.65 సెకన్లు (హీట్స్‌-2లో చివరి, ఓవరాల్‌గా 40వ స్థానం)
స్వర్ణ పతక విజేత: దినా ఆషెర్‌ స్మిత్‌ (బ్రిటన్‌), 21.88 సెకన్లు

400 మీటర్ల పరుగు

అంజలీ దేవి(భారత్‌): 52.33సెకన్లు (హీట్‌-6లో 6వ, ఓవరాల్‌గా 37వ స్థానం)
స్వర్ణ పతక విజేత: సల్వా ఈద్‌ నాసెర్‌ (బెహ్రయిన్‌), 48.14 సెకన్లు

1500 మీటర్ల పరుగు

పీయూ చిత్ర (భారత్‌): 4 నిమిషాల 11.10 సెకన్లు (హీట్‌-2లో 8వ, ఓవరాల్‌గా 30వ స్థానం)
స్వర్ణ పతక విజేత: సిఫాన్‌ హసన్‌ (నెదర్లాండ్స్‌), 3 నిమిషాల 51.95 సెకన్లు

జావెలిన్‌త్రో

అన్నూరాణి (భారత్‌): క్వాలిఫికేషన్‌ రౌండ్‌: 62.43 మీటర్లు, ఫైనల్‌: 61.12 మీటర్లు (8వ స్థానం)
స్వర్ణ పతక విజేత: కెలీసే లీ బార్బర్‌ (ఆస్ట్రేలియా), 66.56 మీటర్లు
img
ద్యుతీ చంద్‌ (భారత్‌): 11.48సెకన్లు (హీట్‌-3లో 7వ, ఓవరాల్‌గా 37వ స్థానం)
స్వర్ణ పతక విజేత: షెల్లీ అన్‌ఫ్రేసర్‌ ప్రైస్‌ (జమైకా), 10.71
సెకన్లు
img
భారత జట్టు (మహమ్మద్‌ అనస్‌, విస్మయ, జిన్నా మథ్యూస్‌, నిర్మల్‌ టామ్‌): హీట్స్‌లో 3 నిమిషాల 16.14 సెకన్లు, ఫైనల్లో 3 నిమిషాల 15.77 సెకన్లు (7వ స్థానం)
స్వర్ణ పతక విజేత: అమెరికా, 3 నిమిషాల 09.34 సెకన్లు

4X400 మహిళల రిలే పరుగు

భారత జట్టు (జిన్నా మాథ్యూ, పూవమ్మ, విస్మయ, సుభా వెంకటేషన్‌): 3 నిమిషాల 29.42 సెకన్లు (హీట్స్‌-1లో 6వ, ఓవరాల్‌గా 15లో 11వ స్థానం)
స్వర్ణ పతక విజేత: అమెరికా జట్టు, 3 నిమిషాల 18.92 సెకన్లు
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD