పవన్ చేతిలో హర్యానా ఓటమి

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-03 05:31:00

-39పాయింట్లతో షెరావత్ రికార్డు
-ప్లేఆఫ్స్‌కు బెంగళూరు, ముంబా
img
పంచకుల : ప్రొకబడ్డీ ఏడో సీజన్ ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ, బెంగాల్, హర్యానా ఇప్పటికే అర్హత సాధించగా.. తాజాగా బెంగళూరు బుల్స్, యూ ముంబా జట్లు చేరుకున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 59-36 భారీ తేడాతో హర్యానా స్టీలర్స్‌ను మట్టికరిపించింది. బుల్స్ స్టార్ రైడర్ పవన్ షెరావత్ ఏకంగా 39పాయింట్లు సాధించి, పీకేఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు చేసిన ప్లేయర్‌గా పర్‌దీప్ నర్వాల్(33)ను అధిగమించి కొత్త రికార్డు సృష్టించాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపిచడం అంటే ఏంటో చూపించాడు. ఆ ఒక్కడు చేసిన పాయింట్లను హర్యానా జట్టు మొత్తం కలిసినా చేయలేకపోయింది. స్టీలర్స్ జట్టులో రైడర్ ప్రశాంత్ కుమార్(17పాయింట్లు) చేసిన పోరాటం సరిపోలేదు. కాగా డిఫెండింగ్‌లో అసలు హర్యానా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మ్యాచ్ ప్రారంభంలో ఓ దశలో బుల్స్‌ను ఆలౌట్ చేసిన స్టీలర్స్ 12-6తో ఆధిక్యంలో నిలిచింది. ఆ కాసేపటికే పవన్ చెలరేగాడు.వరుస పాయింట్లు సాధిస్తూ హర్యానాకు చెమటలు పట్టించాడు. 12 నిమిషాల్లోనే సూపర్-10 సాధించి.. చెలరేగాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి బుల్స్ 28-18తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఆ తర్వాత షెరావత్ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. అతడి ధాటికి రెండో అర్ధభాగంలోనూ హర్యానా రెండుసార్లు ఆలౌటైంది. మొత్తానికి 23పరుగుల భారీ తేడాతో బెంగళూరు విజయం సాధించి.. ఆత్మవిశ్వాసంతో ప్లేఆఫ్స్‌కు చేరింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో యూ ముంబా 30-26తో పాట్నా పైరెట్స్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరింది. దీంతో మూడుసార్లు చాంపియన్ అయిన పాట్నా ఈసారి నాకౌట్‌కు కూడా చేరలేక పదో స్థానానికే పరిమితమైంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN