పాక్‌ ఆటగాళ్లకు టీ10లో అనుమతి రద్దు….

Amaravatinews

Amaravatinews

Author 2019-10-24 16:29:35

img

Share this on WhatsApp

కరాచి:అబుదాబిలో జరగనున్న టీ10 క్రికెట్‌ లీగ్‌లో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లకు మొదట అనుమతి ఇచ్చిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా ఈ లీగ్‌లో పాల్గొనవద్దని తెలిపింది. ‘ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకొని వారిపై పనిభారం పెరగకూడదని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, పాక్‌ ఆటగాళ్లు దేశవాళీ క్వాద్‌-ఈ-అజామ్‌ ట్రోఫీలో పాల్గొనాల్సి ఉండడంతో టీ10 క్రికెట్‌కు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నామని’ పీసీబీ ఈ మేరకు పేర్కొంది. పొట్టి ఫార్మాట్‌ అయిన టీ10 టోర్నీలో పాకిస్థాన్‌ మాజీ ఆటగాళ్లకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. దీంతో ఈ లీగ్‌లో పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రీది కూడా బరిలోకి దిగనున్నాడు. నవంబర్‌ 15 నుంచి 24 వరకు ఈ టోర్నీ జరగనుండగా దీనిలో ఎనిమిది జట్లు తలపడుతున్నాయి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN