పాక్-ఆసీస్ మ్యాచ్ రద్దు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-11-04 05:51:00

సిడ్నీ: ఇటీవల శ్రీలంకపై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఊపు మీదున్న ఆస్ట్రేలియా.. అదే జోరులో సొంతగడ్డపై పాకిస్థాన్‌ను చిత్తు చేయాలనుకుంటే వరుణుడు అడ్డుపడ్డాడు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 15 ఓవర్లలో 5 వికెట్లకు 107 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (59) ఆకట్టుకున్నాడు. ఈ దశలో భారీ వర్షం కురవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని 15 ఓవర్లలో 119గా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో కంగారూలు 3.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 41 రన్స్ చేసిన దశలో వాతావరణం సహకరించకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD