పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-18 16:45:50

img

పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) వేటు వేసింది. తాజాగా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో.. టెస్ట్ ఫార్మాట్, టీ20 ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ను పీసీబీ తప్పించింది.

ఆస్ట్రేలియాతో నవంబర్‌లో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌లకు బ్యాట్స్‌మెన్ అజర్ అలీని కెప్టెన్‌గా ప్రకటించింది. మూడు టీ20 మ్యాచ్‌లకు బాబర్ అజమ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. సర్ఫరాజ్ పాక్ కెప్టెన్‌గా 2017 నుంచి మూడు ఫార్మాట్‌లకు సారధ్యం వహిస్తున్నాడు. 2017 ఐసీసీ చాంపియన్స్ టైటిల్ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే.. కొన్నాళ్లుగా సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో పాక్ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. దీంతో.. అతని కెప్టెన్సీపై గత కొంత కాలంగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN