పాక్ - లంక వన్డే వర్షార్పణం

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-28 04:28:00

కరాచీ: పదేండ్ల తర్వాత సొంతగడ్డపై అంతర్జాతీయ వన్డే ఆడేందుకు సిద్ధమైన పాకిస్థాన్ జట్టు ఉత్సాహంపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాక్, శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారీ వాన కురవడంతో టాస్‌కు కూడా వీలుకాలేదు. ఈ నెల 29న జరగాల్సిన రెండో వన్డేను కూడా పాక్ క్రికెట్ బోర్డు 30వ తేదీకి వాయిదా వేసింది.

కశ్మీర్‌పై స్పందించేందుకు మిస్బా నిరాకరణ

కశ్మీర్ అంశంపై స్పందించేందుకు పాకిస్థాన్ కోచ్, చీఫ్ సెలెక్టర్ మిస్బా ఉల్ హక్ నిరాకరించాడు. పుల్వామా దాడి అనంతరం టీమ్‌ఇండియా ఓ మ్యాచ్‌లో ఆర్మీ టోపీలు ధరించిన నేపథ్యంలో కశ్మీర్ అంశాన్ని పాక్ క్రికెట్ జట్టు లేవనెత్తే అవకాశముందా అని ఓ జర్నలిస్టు అడుగగా.. క్రికెట్ గురించే మాట్లాడదామని మిస్బా బదులిచ్చాడు.
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN