పాక్-శ్రీలంక రెండోవన్డే వాయిదా.. ఐసీసీ చమత్కారం

Amaravatinews

Amaravatinews

Author 2019-09-28 23:59:30

img

Share this on WhatsApp

దుబాయ్: చాన్నాళ్ల తర్వాత శ్రీలంక జట్టు పాకిస్థాన్ పర్యటనకు రావడంతో పాక్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. పాకిస్థాన్ క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని భావించారు. అయితే, అంతలోనే అభిమానులకు నిరాశ ఎదురైంది. రెండు జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. దీంతో అభిమానులు ఉసూరుమన్నారు. ఇక, ముందస్తు షెడ్యూలు ప్రకారం రేపు (ఆదివారం) రెండో వన్డే జరగాల్సి ఉంది.

అయితే, ఆదివారం కూడా వర్షం పడే అవకాశం ఉండడంతో దానిని సోమవారానికి వాయిదా వేశారు. వర్షం కురుస్తుందన్న సమాచారంతో మ్యాచ్‌ను మరుసటి రోజుకు వాయిదా వేయడాన్ని ఐసీసీ చమత్కరించింది. వర్షం కారణంగా కరాచీలో ఆదివారం జరగాల్సిన రెండో వన్డే సోమవారానికి వాయిదా పడిందన్న విషయాన్ని వెల్లడించిన ఐసీసీ.. వర్షం కారణంగా ఒకే వేదికలో జరగాల్సిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రెండు రోజులు తుడిచిపెట్టుకుపోతుందనే విషయాన్ని మీరెప్పుడైనా విన్నారా? అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN