పిజ్జా ఎందుకు? ఆటపై దృష్టి పెట్టు!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-29 03:00:39

img

కెనడియన్‌ టెన్నిస్‌ బ్యూటీ ఎవ్‌గెనీ బౌచర్డ్‌ మైదానంలో కన్నా సోషల్‌ మీడియాలోనే చాలా చురుగ్గా ఉంటుంది. టెన్నిసేతర విషయాలను అభిమానులతో పంచుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతుంది. 2017లో ఇలాగే ఓసారి ట్విటర్‌లో సూపర్‌ బౌల్‌పై బెట్‌ కాసి ఓడిపోవడంతో ఓ అపరిచిత వ్యక్తితో డేటింగ్‌కు కూడా వెళ్లాల్సి వచ్చింది. తాజాగా తను ట్విటర్‌లో అడిగిన ఓ ప్రశ్నకు ఫ్యాన్స్‌ నుంచి ఇబ్బందికర సమాధానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘ఆర్డర్‌ చేసేందుకు మంచి రుచి గల పిజ్జా ఏది’ అని బౌచర్డ్‌ ట్వీట్‌ చేసింది. దీంతో ఫ్యాన్స్‌ ఆమెతో ఆడుకున్నారు. ‘నాకు ఫోన్‌ చేస్తే నేను తీసుకొస్తాను’, ‘ముందు నీవు గ్రాండ్‌స్లామ్‌ తొలి రౌండ్‌ను గెలిచేందుకు ప్రయత్నించు’, ‘నీవింకా బతికే ఉండి పిజ్జా, బర్గర్‌లు తింటున్నందుకు సంతోషం’ అంటూ తమకు తోచిన సమాధానాలతో ట్వీట్లు చేసి బౌచర్డ్‌ను విసిగించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD