పీటీ ఉషకు ఐఏఏఎఫ్ పురస్కారం

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-26 03:12:00

img
దోహా: భారత దిగ్గజ అథ్లెట్ పీటీ ఉషకు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య(ఐఏఏఎఫ్) పురస్కారం దక్కింది. అథ్లెటిక్స్ చేసిన సేవలకు గుర్తింపుగా ఉషను ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డుతో సత్కరించింది. బుధవారం జరిగిన 52వ ఐఏఏఎఫ్ కాంగ్రెస్‌లో చీఫ్ సెబాస్టియన్ కో చేతుల మీదుగా ఉష గౌరవం పొందింది. ఆసియా నుంచి ఈ పురస్కరానికి ఎంపిక చేసిన ముగ్గురు అథ్లెట్లలో ఉష ఒకరు. తనకు దక్కిన అవార్డుపై ట్విట్టర్ వేదికా స్పందిస్తూ అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా దేశంలో అథ్లెటిక్స్ అభివృద్ధి కోసం నా వంతు శాయశక్తులా కృషి చేస్తాను అని 55 ఏండ్ల ఉష ట్వీట్ చేసింది. పయోలీ ఎక్స్‌ప్రెస్‌గా పేరు గాంచిన ఉష దేశ అథ్లెటిక్స్‌పై చెరుగని ముద్ర వేసింది. జకార్త వేదికగా 1985లో జరిగిన ఆసియా క్రీడల్లో ఈ కేరళ అథ్లెట్ ఐదు స్వర్ణాలతో పాటు కాంస్య పతకంతో మెరిసింది. దీనికి తోడు 1984 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్ విభాగంలో ఉష..సెకనులో వందో వంతు తేడాతో తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN