పుణె టెస్ట్: విజయానికి చేరువలో భారత్!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-13 17:26:01

img

పుణె: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. ఇన్నింగ్స్ విజయం సొంతం చేసుకోవడానికి మరో రెండు వికెట్లే మాత్రమే మిగిలి ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్సులో 275 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్సులోనూ సఫారీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలను ఆదిలోనే ఇషాంత్ శర్మ దారుణంగా దెబ్బతీశాడు. ఓపెనర్‌ మార్‌క్రామ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లెవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. సౌతాఫ్రికా 129 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈల్గర్(48), బవుమా(38) మాత్రమే పర్వాలేదనిపించారు. ఎనిమిదో వికెట్‌‌గా వచ్చిన ఫిలాండర్(37) కాసేపు విసిగించినా ఉమేశ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మహరాజ్, రబాడా ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా, ఉమేశ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ఇషాంత్, షమి చెరో వికెట్ తీసుకున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN