పూణే టెస్ట్: కోహ్లీ సెంచరీ.. రహానే హాఫ్ సెంచరీ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-11 14:55:59

img

పూణే: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో టీమిండియా పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. కెప్టెన్, వైస్ కెప్టెన్.. ఇద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 173 బంతుల్లో టెస్టుల్లో తన 26వ సెంచరీని సాధించాడు. మరోవైపు వైస్‌ కెప్టెన్ అజింక్యా రహానే కూడా నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు. 145 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. 273/3 ఓవర్ నైట్ స్కోర్‌తో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. భారీ స్కోర్ దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం భారతజట్టు స్కోర్ 356/3.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN