పూణే టెస్ట్ హాట్ ఫేవరెట్ భారత్

Teluguglobal

Teluguglobal

Author 2019-10-10 08:06:23

img

  • సఫారీలకు డూ ఆర్ డై గా మారిన టెస్ట్
  • పూణే టెస్టును వెంటాడుతున్న రెయిన్ గాడ్

భారత్-సౌతాఫ్రికాజట్ల తీన్మార్ టెస్ట్ సిరీస్ షో…స్టీల్ సిటీ విశాఖ నుంచి…పూణే నగరానికి చేరింది. మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియంలో గురువారం నుంచి ఐదురోజులపాటు జరిగే ఈమ్యాచ్ లో ఆతిథ్య భారత్ హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. మరోవైపు తొలిటెస్ట్ ఓటమితో కంగుతిన్న సఫారీటీమ్.. పూణే టెస్టులో నెగ్గి సిరీస్ ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది.

పొంచి ఉన్న వరుణ గండం….

img

విశాఖ వేదికగా ముగిసిన తొలిటెస్టులో 203 పరుగుల భారీవిజయంతో 1-0 తో పైచేయిసాధించిన భారత్…వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తోంది. తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేకుండా సమరానికి సై అంటోంది.

మరోవైపు…తొలిటెస్టు ఓటమితో గందరగోళంలో చిక్కుకొన్న సౌతాఫ్రికా మాత్రం…ఆల్ రౌండర్ పీట్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎన్ గిడీని తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే…పూణే టెస్టుకు సైతం వానముప్పు తప్పదని…మ్యాచ్ జరిగే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

టాసే కీలకం….

img

గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలతో పూణే పిచ్ స్వరూపం మారింది. పేస్ – స్వింగ్ బౌలర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్ పాండురంగ సల్గోంకర్ చెబుతున్నారు.

బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూ అనువుగా ఉండే స్పోర్టివ్ పిచ్ ను సిద్ధం చేసినట్లు ప్రకటించారు.

భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాత్రం తమకు వికెట్ తో ఏమాత్రం పనిలేదని…వికెట్ ఏ విధంగా ఉన్నా ప్రత్యర్థిని రెండు ఇన్నింగ్స్ లో ఆలౌట్ చేసే సత్తా తమ బౌలింగ్ ఎటాక్ కు ఉందని ధీమాగా చెబుతున్నారు.

img

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు కెప్టెన్ ముందుగా…బ్యాటింగ్ ఎంచుకొనే అవకాశాలు లేకపోలేదు. మ్యాచ్ తొలిరోజున పేస్ బౌలర్లకు పిచ్ అనుకూలించినా…రెండు, మూడు రోజుల ఆటలో మాత్రం పరుగుల మోత మోగటం ఖాయమని క్యూరేటర్ అంటున్నారు.

ఒకవేళ పూణే వికెట్ పేస్ బౌలర్లకు అనువుగా ఉంటే…సఫారీ ఫాస్ట్ బౌలర్ల త్రయం రబాడా,విలాండర్, ఎన్ గిడీల నుంచి భారత టాపార్డర్ కు అసలు సిసలు పరీక్ష తప్పదు.

160 పాయింట్లతో భారత్ టాప్…

img

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన మూడుకు మూడుటెస్టుల్లోనూ నెగ్గడం ద్వారా…టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ 160 పాయింట్లతో… టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది.

రెండోటెస్టులో సైతం నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదల భారతజట్టులో కనిపిస్తోంది. భారత టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కొహ్లీ మ్యాచ్ ల హాఫ్ సెంచరీ పూర్తి చేయనున్నాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD