పైరేట్స్‌పై ఢిల్లీ గెలుపు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-27 04:17:39

జైపూర్‌: ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా నిలవాలంటే తప్పని సరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ ఓటమి చవిచూసింది. ఢిల్లీ రైడర్‌ విజయ్‌ సూపర్‌ రైడ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పడంతో.. గెలవాల్సిన మ్యాచ్‌ను పైరేట్స్‌ చేజార్చుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్‌ ఢిల్లీ 43-39తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. స్టార్‌ రైడర్‌ పర్‌దీప్‌ నర్వాల్‌ 19 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా మిగతా వారి నుంచి అతడికి తగిన సహకారం అందలేదు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ జట్టు నుంచి విజయ్‌ 13, నవీన్‌ కుమార్‌ 11 పాయింట్లు సాధించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD