పొట్టి ప్రపంచకప్‌లో కొత్త జట్టు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-29 04:35:00

తొలిసారి ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొననున్న పపువా న్యూ గినియా
img
దుబాయ్: దశాబ్ద కాలంగా ఆటలో కొనసాగుతున్నా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీకి కూడా అర్హత సాధించలేకపోయిన పపువా న్యూ గినయా (పీఎన్‌జీ) ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. పొట్టి ప్రపంచకప్‌నకు ముందు నిర్వహించిన క్వాలిఫయింగ్ టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబర్చడం ద్వారా వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే మెగాటోర్నీలో అడుగుపెట్టింది. పీఎన్‌జీతో పాటు ఐర్లాండ్ కూడా వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీ గ్రూప్-ఏలో భాగంగా ఆరు మ్యాచ్‌లాడి ఐదింట నెగ్గిన పపువా న్యూ గినియా ఆదివారం కెన్యాతో జరిగిన చివరి మ్యాచ్‌లో 19.3 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో కెన్యా 73 రన్స్‌కే ఆలౌటవడంతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 12.3 ఓవర్లలో నెదర్లాండ్స్ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.. అది సాధ్యపడకపోవడంతో పపువా న్యూ గినియా నేరుగా ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD