పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ సవాలు వంటిదే

Mana Telangana

Mana Telangana

Author 2019-10-17 15:36:46

న్యూఢిల్లీ: టెస్టులతో పోల్చితే పరిమిత ఓవర్లలో కెప్టెన్సీ భిన్నమైందని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. బుధవారం రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోని తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు. టెస్టు మ్యాచ్‌లో అయితే తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయని, అయితే ట్వంటీ20 ఫార్మాట్‌లో మాత్రం అలాంటిఛాన్స్ ఉండదన్నాడు. టి20లలో వేగం గా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఏమాత్రం ఆలస్యం చేసినా ఫలితం తారుమారు కావడం ఖాయమన్నాడు.

దీంతో పొట్టి ఫార్మాట్‌లో సారథ్యం చాలా క్లిష్టమైందన్నాడు. టెస్టుల్లో అయితే తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడానికి తగినంత సమయం ఉంటుందన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో విఫలమైనా తర్వాతి ఇన్నింగ్స్‌లో మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందన్నాడు. కానీ, వన్డేలు, టి20లలో ఇలాంటి వెసులుబాటు ఉండదన్నాడు. ముఖ్యంగా టి20లలో అయితే బంతి బంతి కి ఫలితం మారుతూ ఉంటుందని, ఏ మాత్రం నిర్లక్షం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ధోని పేర్కొన్నాడు. ఈ ఫార్మాట్‌లో మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేయాల్సి ఉంటుందని, అంతేగాక వ్యూహాత్మకంగా, ప్రత్యర్థి జట్లకు భిన్నంగా ఆలోచించినప్పుడే జట్టును విజయపథంలో నడిపించే అవకాశం ఉంటుందన్నాడు. ఇక, తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడూ ఎక్కువగా ప్రత్యర్థి వ్యూహాలను కనిపెడుతూ ఉండేవాడినని వివరించాడు. అంతేగాక వారికి భిన్నంగా ఆలోచించి తన వ్యూహాలకు పదును పెట్టేవాడినని తెలిపాడు. అందువల్లే విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకోగలిగానని స్పష్టం చేశాడు.

ఇక కెప్టెన్ కూల్‌గా రాణిం చడం వెనుక ఉన్న అసలు కారణాన్ని కూడా ధోని ఈ సందర్భంగా వెల్లడించాడు. నేను కూడా మనిషి నే.. నాకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అయితే తనకు ఈ సమయంలో వచ్చే ప్రతికూల ఆలోచనలను సాధ్యమైనంత వర కు అదుపులో పెట్టుకుంటాను. దీంతో కోపాన్ని దిగమించుకుంటూ ప్రతికూల పరిస్థితుల్లోనూ కూల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా. అందువల్లే తనకు మిస్టర్ కూల్ అనే పేరు సార్ధకమైందన్నాడు. ప్రతికూల ఆలోచనలను నియంత్రించే విషయంలో ఇతరులకన్నా కాస్త భిన్నంగా ఉంటానన్నాడు. మరోవైపు గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడూ అందరిలాగే నాకు కూడా నిరాశ కలుగుతోంది. అంతేగాక చాలా కోపం కూడా వస్తోంది. ఇలాంటి సమయంలో సాధ్యమైనంత వరకు కోపాన్ని అనచుకునేందుకు ప్రయత్నిస్తా. ఇందులో చాలా వరకు సఫలం అవ్వడం వల్ల కోపం బహిర్గతం కాదని ధోని వివరించాడు.

MS Dhoni Reveals How He Deals With Situations

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD