పోటీ పక్కనపెట్టి తోటి వాడిన గెలిపించిన అథ్లెట్

10 TV News Channel

10 TV News Channel

Author 2019-09-29 15:43:25

img

నిజమైన విజేతను కొలవడానికి స్టాప్ వాచ్, కొలతల టేపో అవసరం లేదు. మనసులు గెలిచిన వాడే నిజమైన విజేత. అతని క్రీడా స్ఫూర్తికి  మనస్సుల్లోనే గోల్డ్ మెడల్ ఇచ్చేశారు. బ్రామా సన్సార్ దాబో అనే వ్యక్తి 5వేల మీటర్ల పరుగుల పందెంలో అతని పరుగు ఆపేసి పక్క వ్యక్తిని పోటీ పూర్తి చేసేందుకు సాయం చేశాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ పోటీలో ఎట్టకేలకు ఇద్దరూ కలిసి పోటీ పూర్తి చేశారు. 

ఖతార్‌ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో చోటు చేసుకుంది. అరుబా దేశానికి చెందిన రన్నర్ జొనాథన్ బస్బీ ఆఖరి రౌండ్‌లో పరుగెత్తలేకపోయాడు. ఇది గమనించిన గున్యా పోటీదారుడు బ్రైమా సుంకర్ డాబో..  తన పరుగును ఆపి బస్సీకి సాయమందించాడు. రౌండ్ పూర్తయ్యేవరకు చేయందుకుని పరుగును పూర్తి చేశాడు.

తోటి రన్నర్లంతా పరుగు పూర్తి చేసిన 5 నిమిషాలకు గమ్యాన్ని చేరుకున్నారు. ఈ ఘటనకు స్పందించిన అభిమానులు స్టేడియంలో డాబోను చప్పట్లతో అభినందించారు. సాయమందుకున్న డాబో తన కెరీర్లో బెస్ట్ టైమ్ తో పరుగును పూర్తి చేయగలిగాడు. దురదృవశాత్తు లైన్ దాటి పరుగెత్తడంతో డాబోపై పరుగు పందెంలో అనర్హత వేటు పడింది. 

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD