పౌలా రాడ్‌క్లిఫ్‌ రికార్డు బద్దలు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-14 04:22:39

img

  • మహిళల మారథాన్‌లో కెన్యా అథ్లెట్‌ కోస్గె సంచలనం

చికాగో: మహిళల మారథాన్‌లో కెన్యా అథ్లెట్‌ బ్రిగిడ్‌ కోస్గె సంచలనం సృష్టించింది. చికాగో మారథాన్‌ రేసును కోస్గె 2 గంటలా 14 నిమిషాల 4 సెకన్లలో ముగించి మహిళల మారథాన్‌ దిగ్గజం పౌలా రాడ్‌క్లిఫ్‌ పేరిటనున్న 16 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 2003లో లండన్‌ మారథాన్‌ రేసును రాడ్‌క్లిఫ్‌ 2 గంటలా 15 నిమిషాల 25 సెకన్ల రికార్డు టైమింగ్‌తో ముగించింది. 25 ఏళ్ల కోస్గె ఈ ఏడాది ఏప్రిల్‌లో లండన్‌లో జరిగిన హాఫ్‌ మారథాన్‌ రేసును అత్యంత వేగంగా గంటా 4 నిమిషాల 28 సెకన్లలో ముగించి రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN