ప్రకాశం, కర్నూలు మ్యాచ్‌ డ్రా

Prajasakti

Prajasakti

Author 2019-09-27 04:19:37

img

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ :
ప్రకాశం, కర్నూలు జట్ల మధ్య జరిగిన మూడు రోజుల మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. క్రికెట్‌ ప్రకాశం ఆధ్వర్యంలో ఒంగోలు సిఎస్‌ఆర్‌ శర్మ కళాశాల క్రీడా మైదానంలో అండర్‌-14 గ్రూపు-బి మ్యాచ్‌లలో భాగంగా ప్రకాశం, కర్నూలు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవర్‌ నైట్‌ స్కోరు 2/0తో చివరి రోజు ఆట ప్రారంభించిన ప్రకాశం జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ జట్టులో సిహెచ్‌ పవన్‌ కార్తీకేయ 94 (262 బంతుల్లో; 10 ఫోర్లు) తృటిలో సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతనికి తోడు కె.సాత్విక్‌ 33 పరుగులతో రాణించాడు. కర్నూలు బౌలర్‌లలో డి.అక్షిత్‌ రెడ్డి, ధనుష్‌ నాయుడు, సిహెచ్‌ శివసాయి ధీరజ్‌ మూడేసి చొప్పున వికెట్లు తీశారు. అనంతరం కర్నూలు జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD