ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలం..!

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-22 18:06:45

img

రాంచీ వేదికగా జరిగిన ఫైనల్‌దైన మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.. దీంతో టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది.. మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది.. ఇక టీమిండియా ప్రపంచంలో ఎక్కడైనా ఆడగలదు.. సిరీస్‌లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడియన టీమిండియా కెప్టెన్.. ప్రపంచ దేశాల్లో భారత్ ఎక్కడైనా సిరీస్‌లు గెలువగలదన్నారు. ఇక, సౌతాఫ్రికాతో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్ చాలా గొప్పగా సాగిందనీ.. ఈ సిరీస్‌ విజయం సమిష్టిగా సాధించిందని వెల్లడించాడు. మరోవైపు టీమిండియా లాంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఏ జట్టులోనూ లేదని అభిప్రాయపడ్డారు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స్పిన్‌ బౌలింగ్‌ ఎప్పటికీ మన జట్టు బలం. అలాగే బ్యాటింగ్‌ కూడా... కానీ, ఈ సమకాలీన సిరీస్‌ల్లో మా పేస్‌ బౌలర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రశంసించారు. ఇక, టెస్ట్ క్రికెట్‌లో రోహిత్‌ ఓపెనర్‌గా సక్సెస్ కావడం కూడా భారత జట్టుకు అదనపు బలంగా తెలిపారు కోహ్లీ.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN