ప్రపంచకప్‌లో స్కాట్లాండ్కు చోటు
దుబాయ్ : ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి స్కాట్లాండ్ అర్హత సాధించింది. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీ ప్లేఆఫ్ మ్యాచ్‌లో స్కాటిష్ జట్టు 90 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య యూఏఈని ఓడించి, పొట్టి ప్రపంచకప్‌నకు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు ఓపెనర్ మున్సే(65) సహా బెర్రింగ్టన్(48) రాణించడంతో 198 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయిన యూఏఈ 18.3 ఓవర్లలోనే 108 పరుగులకే ఆలౌటైంది.