ప్రపంచ రికార్డుకు చేరువలో అశ్విన్

Newwaves

Newwaves

Author 2019-10-06 10:03:00

img

విశాఖపట్నం: ఇంకొక్క వికెట్ తీస్తే.. టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో ప్రపంచ రికార్డును సమం చేసినవాడవుతాడు. ఒకటి కంటే ఎక్కువ వికెట్లు తీస్తే.. మాత్రం ప్రపంచ రికార్డు అశ్విన్ తన ఖాతాలో వేసుకుంటాడు. విశాఖపట్నం వేదికగా పర్యాటక దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఏడు వికెట్లను విరగ్గొట్టి తన సత్తా చాటాడు. సుమారు 9 నెలల విరామం తర్వాత టెస్ట్ జట్టులోకి వచ్చిన అశ్విన్ బౌలింగ్ అద్భుతంగా వేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 431 రన్స్‌కు ఆలౌట్ అయ్యారు. ఈ క్రమంలో అశ్విన్ ప్రపంచ రికార్డును సమం చేయడానికి ఒక్క వికెట్ తీయాల్సి ఉంది.

అంతకు ముందు టెస్టుల్లో అత్యధికంగా 350 వికెట్లు పడగొట్టిన శ్రీలంక మాజీ స్పిన్నింగ్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ పేరున ప్రపంచ రికార్డు ఉంది. ఇక విశాఖ వన్డేలో అశ్విన్ ఏడు వికెట్లతో కలిపి మొత్తం 349 వికెట్లు తీశాడు. ముత్తయ్య మురళీధరన్ 66 టెస్టుల్లో 350 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో తన కెరీర్‌లో అశ్విన్ 66వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ తొలి టెస్ట్ మ్యాచ్ చివరి రోజు ఆదివారం జరుగుతుంది. మరో వికెట్ పడగొడితే మురళీధరన్ రికార్డును అశ్విన్ సమం చేస్తాడు.

కాగా.. విశాఖ తొలి టెస్ట్ మ్యాచ్ మాంచి రసకందాయంలో జరుగుతోంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఏడు వికెట్ల నష్టానికి 502 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత 91 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ చేసిన విరాట్ సేన నాలుగు వికెట్లు నష్టపోయి 323 పరుగుల వద్ద మళ్ళీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో 395 పరుగుల విజయ లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన సౌతాఫ్రికా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 11 రన్స్ చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే.. దక్షిణాఫ్రికా ఇంకా 384 పరుగులు చేయాల్సి ఉంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN