ఫలితం వచ్చేవరకూ సూపర్‌ ఓవర్‌

Prajasakti

Prajasakti

Author 2019-10-15 02:25:26

img

* ఐసిసి ఆమోదం
దుబాయ్: ప్రపంచకప్‌ సెమీస్‌, ఫైనల్లో ఫలితం వచ్చేవరకూ సూపర్‌ ఓవర్‌ను కొనసాగిస్తామని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) వెల్లడించింది. సోమవారం దుబారులో జరిగిన సమావేశంలో ఐసిసి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ సూపర్‌ ఓవర్‌ టైగా ముగిస్తే బౌండరీల ప్రాతిపదికపై విజేతను నిర్ణయించేవారు. దీంతో ఈ ఏడాది ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ను బౌండరీల ప్రాతిపదికపై విజేతగా ప్రకటించడంతో ఐసిసిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. దీంతో అనిల్‌కుంబ్లే నేతృత్వంలో సూపర్‌ఓవర్‌ నిబంధనలపై ఐసిసి ఓ కమిటీని నియమించింది. కుంబ్లే కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసిసి ఓ ప్రకటనలో తెలిపింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN