ఫలితం .. సూపర్ ఓవర్ తోనే .. మరో మార్గం లేనట్టే..

Navyamedia

Navyamedia

Author 2019-09-24 23:59:12

img

తాజా ప్రపంచ కప్ రేసులో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తుదిపోరు టై గా ముగిసింది. దీంతో అంపైర్లు సూపర్‌ ఓవర్‌ను నిర్ణయించారు. సూపర్ ఓవర్‌ కూడా టై కావడంతో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు. దీనిపై క్రికెట్ అభిమానులతో పాటు పలువు మాజీ క్రికెటర్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పాత చింతకాయపచ్చడి రూల్స్‌ని మార్చి కొత్తగా నియమ, నిబంధనలు అమలు చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. అయితే సూపర్‌ ఓవర్‌లోనూ స్కోరు సమమైతే విజేత తేలేవరకు అనేక సూపర్‌ ఓవర్లు ఆడించే పద్ధతిని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవేశపెట్టనుంది. ఆసీస్‌లో జరగనున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో ఈ పద్ధతిని ప్రయోగించనున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం ఫైనల్లో, సూపర్ ఓవర్‌లోనూ స్కోరు సమం అయితే స్పష్టమైన మెజారిటీ వచ్చే వరకు మరో సూపర్‌ ఓవర్‌ను ఆడించాలి. ‘ప్రపంచకప్ ఫైనల్‌ తర్వాత సూపర్‌ఓవర్ నిబంధనలపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఉమెన్స్‌ బిగ్‌బాష్ లీగ్‌ సెమీఫైనల్‌ సిడ్నీ సిక్సర్స్‌ వెర్సెస్ మెల్‌బోర్న్‌ రెనెగెడెస్ మ్యాచ్‌తో జట్లు అభిప్రాయాలు, అభిమానుల ఆలోచనలు మాకు అర్థమయ్యాయి. పురుషుల, మహిళల బిగ్‌బాష్‌ లీగుల్లో మల్టిపుల్‌ సూపర్‌ ఓవర్స్‌ అభిమానులను అలరిస్తాయని ఆశిస్తున్నాం. ఉత్కంఠ భరితంగా సాగే నాకౌట్‌ మ్యాచ్‌లను విజయవంతంగా ముగించే బలమైన వ్యవస్థ మావద్ద ఉంది’ అని బిగ్‌బాష్‌ లీగ్‌ ప్రధానాధికారి అలిస్టెయిర్‌ డాబ్సన్ తెలిపారు. మల్టిపుల్ సూపర్ ఓవర్లను ఆడించడంలో కాల పరిమితులు, బ్రాడ్‌కాస్ట్‌, మైదాన సంబంధిత ఇబ్బందులు తలెత్తితే ఉన్నత స్థానంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు.READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN