ఫాలోఆన్‌లో తొలి వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా

Nava Telangana

Nava Telangana

Author 2019-10-13 12:30:00

పుణె: భారత్‌ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. పర్యాటక జట్టు ఫాలోఆన్‌ ఆడుతుండగా.. మ్యాచ్‌ మొదలైన రెండో బంతికే ఇషాంత్‌ శర్మ తొలి వికెట్‌ వికెట్‌ పడగొట్టాడు. ఓపెనర్‌ మార్‌క్రమ్‌ని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని రెండో ఇన్నింగ్స్‌లో శుభారంభం చేశాడు. ఇదిలా ఉండగా శనివారం తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 275 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కేశవ్‌ మహారాజ్‌(72), ఫిలాండర్‌(44)ల జోడి తొమ్మిదో వికెట్‌కు 109 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుతం ఎల్గర్‌, డిబ్రయిన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN