ఫేస్‌బుక్‌కు ఐసిసి డిజిటల్‌ హక్కులు

Prajasakti

Prajasakti

Author 2019-09-29 06:10:31

img

దుబాయ్‌: రాబోయే నాలుగేళ్లలో అంత ర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసిసి) నిర్వహించే ప్రధాన టోర్నీలకు సంబంధించిన డిజిటల్‌ హక్కులన్నింటినీ ఫేస్‌బుక్‌ సొంతం చేసుకుంది. దీంతో 2019 నుంచి 223 వరకు నిర్వహించే అన్ని మెగా ఈవెంట్లు ఇందులో భాగం కానున్నాయి. రెండు టీ20 ప్రపంచకప్‌లతో పాటు ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, టీ20 ప్రపంచకప్‌ అర్హత టోర్నీ, అండర్‌-19 ప్రపంచకప్‌ ఈవెంట్ల డిజిటల్‌ హక్కులను ఫేస్‌బుక్‌ దక్కించుకుంది. ప్రతి మ్యాచ్‌కు ముందు రీక్యాప్స్‌తోపాటు, ఆటలోని ముఖ్య ఘటనలతో కూడిన వీడియోలను ఫేస్‌బుక్‌ ప్రసారం చేయనుంది. ఐసిసి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మను సావ్నే మాట్లాడుతూ ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని, ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ టోర్నీని ఫేస్‌బుక్‌ ద్వారానే 1.2 బిలియన్ల నిమిషాల వీడియోలను అభిమానులు వీక్షించారని తెలిపారు. క్రికెట్‌ను విస్తరించి అభిమానులకు చేరువ కావాలనే ఉద్దేశ్యంతో సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త ప్రయత్నం చేస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిజేశారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD