ఫేస్‌బుక్‌తో ఐసీసీ ఒప్పందం

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-27 04:15:40

దుబాయ్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గురువారం ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందంలో భాగంగా ఐసీసీ గ్లోబల్‌ ఈవెంట్స్‌కు సంబంధించిన డిజిటల్‌ కంటెంట్‌ హక్కులు ఫేస్‌బుక్‌కు దక్కాయి. 2023 వరకు కొనసాగనున్న ఈ ఒప్పందం ప్రకారం.. మ్యాచ్‌లకు సంబంధించిన రీక్యా్‌పలు, మ్యాచ్‌ రికార్డులు, ముఖ్య ఘట్టాలకు సంబంధించి మొత్తం సమాచారం ఫేస్‌బుక్‌లో లభ్యమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది వీక్షించే క్రీడగా క్రికెట్‌ను తయారుచేసేందుకు ఫేస్‌బుక్‌తో ఒప్పందం దోహదపడనుందని ఐసీసీ సీఈవో మను సావ్నే అన్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD