ఫైనల్లో కర్ణాటక X తమిళనాడు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-24 06:16:10

బెంగళూరు: విజయ్‌ హజారే ట్రోఫీలో కర్ణాటక, తమిళనాడు జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. శుక్రవారం ఫైనల్‌ జరగనుంది. తొలి సెమీ్‌సలో కర్ణాటక 9 వికెట్ల తేడాతో చత్తీస్‌గఢ్‌పై గెలిచింది. తొలుత చత్తీ్‌సగఢ్‌ 49.4 ఓవర్లలో 223 రన్స్‌కు ఆలౌటైంది. అమన్‌దీ్‌ప (78) రాణించాడు. ఛేదనలో ఓపెనర్లు దేవ్‌దత్‌ (92), కేఎల్‌ రాహుల్‌ (88) రాణించడంతో.. కర్ణాటక 40 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 229 రన్స్‌ చేసి అలవోకగా నెగ్గింది. రెండో సెమీ్‌సలో తమిళనాడు 5 వికెట్ల తేడాతో గుజరాత్‌పై గెలుపొందింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించగా.. తొలుత గుజరాత్‌ 9 వికెట్లకు 177 పరుగులే చేసింది. ఛేదనలో తమిళనాడు 39 ఓవర్లలో 5 వికెట్లకు 181 రన్స్‌ చేసి నెగ్గింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD