ఫైనల్ చేరిన అన్నూ రాణి

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-01 03:18:00

img
భారత జావెలిన్ త్రోయర్ అన్నూ రాణి చరిత్ర సృష్టించింది. ప్రపంచ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా నిలిచింది. సోమవారం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఏలో బరిలోకి దిగిన రాణి.. రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 62.43 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచింది. తద్వారా తుదిపోరుకు చేరింది. పతకం కోసం మంగళవారం పోరాడనుంది. తొలి ప్రయత్నంలో 57.05 మీటర్లే సాధించి నిరాశ పరిచిన అన్నూ.... రెండో ప్రయత్నంలో 62.43 మీటర్లు విసిరి తన పేరిటనే ఉన్న జాతీయ రికార్డు (62.34)ను తిరగరాసింది. ఇక చివరి రౌండ్‌లో 60.50 మీటర్లకే పరిమితమైనా మూడో స్థానంలో నిలిచి తుదిపోరుకు చేరింది. క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో 67.27 మీటర్లను సాధించిన హుయ్‌హుయ్ లూ(చైనా) అగ్రస్థానంలో, హుస్సోంగ్ (జర్మనీ, 65.29) రెండో స్థానంలో నిలిచారు. మొత్తం 12 మంది ఫైనల్‌కు చేరారు.

మహిళల 200మీటర్ల పరుగు హీట్-2లో బరిలోకి దిగిన భారత స్ప్రింటర్ అర్చనా సుసీంద్రన్ 23.65 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 8వ స్థానంలో నిలిచి, నిరాశ పరిచింది. 43 మంది పోటీ పడిన రేసులో 40వ స్థానంలో నిలిచింది. ఇక 400 మీటర్ల మహిళల పరుగు పోటీలో భారత స్ప్రింటర్ అంజలీ దేవి హీట్-6లో బరిలోకి దిగి ఆరోస్థానంలో నిలిచింది. లక్ష్యాన్ని చేరుకునేందుకు 52.33 సెకన్ల సమయం తీసుకున్న అంజలీ తొలి రౌండ్‌తోనే పోరాటాన్ని చాలించింది. 46 మంది పోటీలో ఉండగా 36వ స్థానంలో నిలిలింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN