బంగారు బైల్స్‌ !

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-13 06:41:01

img

టాప్‌ మహిళా జిమ్నాస్టులనగానే నాడియా కొమనేసి (రుమేనియా), లారీసా లాటినినా (రష్యా) మనకు గుర్తొస్తారు. కారణం.. తమ అద్భుత విన్యాసాలతో వారు ప్రపంచాన్ని నివ్వెరపరచడమే. అయితే, ఇటీవలి కాలంలో వారిద్దరి స్థాయిలో మారుమోగుతున్న పేరు సిమోన్‌ బైల్స్‌. అమెరికాకు చెందిన ఈ జిమ్నాస్టిక్స్‌ క్వీన్‌ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో ఔరా అనిపిస్తోంది. వరుస పతకాలలో ఆల్‌టైమ్‌ రికార్డు దిశగా దూసుకుపోతోంది.

జిమ్నాస్టిక్స్‌లో ఎదురులేని తారగా వెలుగొందుతున్న 21 ఏళ్ల సిమోన్‌ బైల్స్‌ బాల్యం కష్టాలు, కన్నీళ్లమయం. 1997లో అమెరికాలోని ఒహాయో రాష్ట్ర రాజధాని కొలంబ్‌సలో ఆమె జన్మించింది. నలుగురు సంతానంలో ఆమె మూడోది. అడ్రియా, యాష్లే, టెవిన్‌ మిగిలిన ముగ్గురు. తల్లి షానన్‌ బైల్స్‌, తండ్రి కెల్విన్‌ క్లెమన్స్‌ మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసలై పిల్లలను పట్టించుకోలేదు. దాంతో షానన్‌ తండ్రి రాన్‌.. బైల్స్‌, అడ్రియాను దత్తత తీసుకున్నాడు. మిగిలిన ఇద్దరినీ మరో బంధువు దత్తత తీసుకున్నాడు. దాంతో బైల్స్‌ నివాసం తాతయ్య ఊరు టెక్సా్‌స రాష్ట్రంలోని స్ర్పింగ్‌కు మారింది. ఆరేళ్ల వయసులో.. క్షేత్ర పర్యటనలో భాగంగా ఓ జిమ్నాస్టిక్‌ సెంటర్‌ను సిమోన్‌ సందర్శించింది. అక్కడ బైల్స్‌ నైపుణ్యాలకు అచ్చెరువొందిన కోచ్‌ రూనీ ఆమెలో గొప్ప జిమ్నాస్ట్‌ అయ్యే లక్షణాలున్నాయంటూ బైల్స్‌ కుటుం బానికి తెలియజేశాడు. వారి అనుమతితో అలా జిమ్నాస్టిక్స్‌లోకి అడుగుపెట్టిన బైల్స్‌ అనతి కాలంలోనే తన ప్రతిభకు మెరుగులు అద్దుకుంది.

జూనియర్‌ స్థాయిలోనే..

2007లో లెవెల్‌-8 జిమ్నా్‌స్టగా పోటీల బరిలోకి దిగిన బైల్స్‌ 2011నాటికి జూనియర్‌ స్థాయిలో తిరుగులేని జిమ్నా్‌స్టగా నిలిచింది. ఆ ఏడాది అమెరికా క్లాసిక్‌ జిమ్నాస్టిక్స్‌ టోర్నీలో వాల్ట్‌, బ్యాలెన్స్‌బీమ్‌లో అగ్రస్థానం సాధించిన ఆమె.. ఆల్‌రౌండ్‌ విభాగంలో మూడోస్థానం దక్కించుకుంది. మరుసటి సంవత్సరం కూడా ఆమె తన అద్భుత ప్రదర్శనను కొనసాగించింది. అమెరికన్‌ క్లాసిక్‌, ఆల్మో క్లాసిక్‌ తదితర పోటీల్లో వాల్ట్‌, ఆల్‌రౌండ్‌ ఈవెంట్లలో టైటిళ్లు అందుకుంది. 2013లో యూఎస్‌ పీజీ చాంపియన్‌షి్‌ప ఆల్‌రౌండ్‌ విభాగంలో విజేతగా నిలిచి సీనియర్‌ స్థాయిలో తన ఆగమనాన్ని ఘనంగా చాటింది. అదే ఏడాది వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో ఆల్‌రౌండ్‌లో స్వర్ణ పతకం నెగ్గింది. తద్వారా ఈ టోర్నీలో టైటిల్‌ గెలిచిన తొలి ఆఫ్రికా-అమెరికా మహిళగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత వరల్డ్‌ చాంపియన్‌షి్‌పతోపాటు ఒలింపిక్స్‌లో తన పతకాల పరంపరకొనసాగిస్తూ ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా ఎదిగింది. ప్రస్తుతం జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరుగుతున్న వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలోనూ హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే రెండు స్వర్ణాలు (టీమ్‌ విభాగం, ఆల్‌రౌండ్‌) నెగ్గింది. ఇక వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో ఆల్‌రౌండ్‌ టైటిల్‌ గెలవడం ఐదోసారి కావడం విశేషం. ఆల్‌రౌండ్‌ స్వర్ణంతో ఆమె ప్రపంచ పతకాల సంఖ్య 22కు చేరింది. మొత్తంగా 21 పతకాలతో రష్యాకు చెందిన సెత్లీనా ఖోర్‌కీనా పేరిట ఉన్న రికార్డును బైల్స్‌ బద్దలుగొట్టింది. బెలార్‌స జిమ్నాస్ట్‌ విటాలి స్కెహర్బో 23 పతకాల ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసేందుకు ఒక పతకం దూరంలో ఉంది. స్టట్‌గార్ట్‌లో ఆదివారం జరిగే ‘ఫ్లోర్‌’ ఫైనల్లోనూ బైల్స్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN