బంగ్లాకు ఇదే మంచి తరుణం: వివిఎస్.లక్ష్మణ్

Mana Telangana

Mana Telangana

Author 2019-11-01 02:48:32

img

న్యూఢిల్లీ: భారత జట్టును ట్వంటీ20లో ఓడించేందుకు బంగ్లాదేశ్ జట్టుకు ఇదే మంచి తరుణమని భారత మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి లేకుండా బరిలోకి దిగుతున్న టీమిండియాను ఓడించడం కష్టం కాదన్నాడు. ఎందుకంటే భారత జట్టు కూడా యువ క్రికెటర్లకే ప్రాధాన్యత ఇచ్చిందన్నాడు. రోహిత్, రాహుల్, ధావన్, మనీష్ పాండేలను తప్పిస్తే భారత్‌లో కూడా పెద్దగా అనుభవజ్ఞులు లేరన్నాడు. ఇక, టి20 ఫార్మాట్‌లో మంచి రికార్డు కలిగిన బంగ్లాకు కూడా గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయన్నాడు.

సామర్థం మేరకు రాణిస్తే భారత్‌ను ఓడించే అవకాశం ఉందన్నాడు. వన్డేలు, టెస్టులతో పోల్చితే పొట్టి ఫార్మాట్‌లో ఏ జట్టుకైనా విజయవకాశాలు అధికంగా ఉంటాయన్నాడు. ఒకటి రెండు ఓవర్లే మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయన్నాడు. ఆ సమయంలో నిలకడగా రాణించే జట్టుకు విజయం సాధించడం కష్టం కాదన్నాడు. ఇక, బంగ్లాదేశ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదన్నాడు. రహీం, మహ్మదుల్లా, దాస్, ముసద్దిక్ తదితరులు బ్యాటింగ్‌లో ఎంతో పరిణితి సాధించారన్నాడు. సమష్టిగా రాణిస్తే సిరీస్‌లో బంగ్లాదేశ్‌కు గెలిచే అవకాశాలు ఖాయమని లక్ష్మణ్ జోస్యం చెప్పాడు.

T20 series Bangladesh best chance to beat India

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD