బంగ్లాతో టీ20 సీరీస్‌కు కోహ్లీ దూరం

Newwaves

Newwaves

Author 2019-10-20 10:27:00

img

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో మనదేశంలో జరగనున్న టీ20 సీరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొనడంలేదు. ఈ ఏడాది మార్చి నుంచీ విరాట్ కోహ్లీ నాన్ స్టాఫ్‌గా క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని జట్టు మేనేజ్‌మెంట్ కెప్టెన్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కోహ్లీ ప్లేస్‌లో రోహిత్‌శర్మ టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు.

ప్రపంచకప్‌కు ముందు పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినప్పటికీ కోహ్లీకి మాత్రం జట్టు మేనేజ్‌మెంట్ ఆ అవకాశం లేదు. విరాట్ కోహ్లీ చివరిగా ఈ ఏడాది జనవరిలో విశ్రాంతి తీసుకున్నాడు. జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సీరీస్‌లో చివరి రెండు వన్డేలతో పాటు ఆ తర్వాత జరిగిన టీ20 సీరీస్‌ నుంచి కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు.

బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం బంగ్లాదేశ్‌తో జరిగే మూడు టీ20ల సీరీస్ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చేందుకు జట్టు మేనేజ్‌మెంట్ సిద్ధమైంది. ‘అవును.. ఆస్ట్రేలియా సీరీస్, ఐపీఎల్, ప్రపంచకప్, వెస్టిండీస్‌లో పర్యటన, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో సీరీస్‌లు ఇలా.. కోహ్లీ నాన్ స్టాఫ్‌గా క్రికెట్ ఆడుతుండటంతో అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం’ అని టీమిండియా మేనేజ్‌మెంట్‌లోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘ఆటగాళ్ల పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని.. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావించాం. విశ్రాంతి ఇవ్వడం వల్ల ఆటగాళ్ళు కూడా తాజాగా ఉంటారు. ఆట పైన వారు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు’ అని ఆ వర్గాలు తెలిపాయి.

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికైనట్లు ప్రకటన వెలువడిన మరుసటి రోజునే బంగ్లాదేశ్‌తో టీ20 సీరీస్‌కు భారతజట్టును ఎంపిక చేయనున్నారు. టీ20 సీరీస్ అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సీరీస్ ఆడనుంది. ఈ సీరీస్‌కు తిరిగి కోహ్లీ జట్టులోకి వస్తాడని టీమిండియా మేనేజ్‌మంట్ వర్గాలు తెలిపాయి. ‘అవును.. విరాట్ కోహ్లీ బంగ్లాతో జరగబోయే రెండు టెస్టులకు జట్టులో తిరిగి వస్తాడు’ అని తెలిపాయి. ఎందుకంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియాను విజేతగా నిలబెట్టేందుకు కోహ్లీ ఏ అవకాశాన్నీ కూడా వదులుకోకూడదని నిర్ణయించుకున్నాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD