బంగ్లాదేశ్‌కు తొలి దెబ్బ.. లిటన్ దాస్ అవుట్
న్యూఢిల్లీ: 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ ఐదోబంతికి లిటన్ దాస్ అవుటయ్యాడు. 4 బంతులు ఎదుర్కొన్న లిటన్ దాస్ ఒక ఫోర్‌తో 7 పరుగులు చేశాడు. ప్రస్తుతం 4ఓవర్లు పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.