బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

Amaravatinews

Amaravatinews

Author 2019-10-24 23:57:52

img

Share this on WhatsApp

ముంబై: బంగ్లాదేశ్‌తో వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించారు. వచ్చే నెల 3 నుంచి 26 వరకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, ఊహించినట్టే సారథి కోహ్లీకి టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. దీంతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 212 (నాటౌట్)తో పరుగుల వరద పారించిన సంజు శాంసన్‌కు టీ20 జట్టులో చోటు లభించింది. ఇక వెన్నెముక గాయంతో బాధపడుతూ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా స్థానంలో ముంబై ఆటగాడు శివమ్ దూబేకు చోటు కల్పించారు. ఇక, టెస్టు జట్టును మాత్రం ఇటీవల జట్టునే యథాతథంగా ప్రకటించారు. రాంచీ టెస్టులో చోటు దక్కించుకున్న షాబాజ్ నదీమ్‌కు తుది జట్టులో చోటు లభించలేదు.

టీ20 జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్

టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారీ, వృద్ధిమాన్ సాహా (కీపర్) రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, రిషభ్‌పంత్

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD