బంగ్లాదేశ్ టార్గెట్ 175 పరుగులు

Nava Telangana

Nava Telangana

Author 2019-11-10 23:26:00

హైదరాబాద్‌ : నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 175 పరుగులు చేయాల్సి ఉంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు బ్యాట్స్ మెన్లు శ్రేయస్ అయ్యర్ 62 పరుగులు, లోకేశ్ రాహుల్ 52, మనీష్ పాండే 22, శిఖర్ ధావన్ 19 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లు షఫీవుల్ ఇస్లామ్ రెండు, సౌమ్య సర్కార్ రెండు, హోసియన్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN