బంగ్లా ఆటగాళ్లను టార్గెట్‌ చేస్తున్న క్రికెట్‌ బోర్డు

Prajasakti

Prajasakti

Author 2019-10-27 03:32:11

img

- టీ20 సిరీస్‌కు జట్టు ప్రకటన
- తమీమ్‌ ఔట్‌... కయీస్‌ ఇన్‌..
భారత్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లా ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ దూరమయ్యాడు. తమీమ్‌ వ్యక్తిగత కారణాలవల్ల భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బోర్డుకు తెలియజేశాడు. దీంతో అతని స్థానంలో కయీస్‌కు చోటు కల్పించారు.

మిర్పూర్‌: క్రికెటర్ల సమ్మెకు నాయకత్వం వహించిన షకీబుల్‌-హసన్‌ను బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డు(బిసిబి) టార్గెట్‌ చేసింది. స్థానిక టెలికాం కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడంటూ అతనిపై చట్టపరమైన తీసుకోవడానికి బిసిబి సిద్ధమైంది. బిసిబి ఆటగాళ్ల ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్‌ కల్గిన జాతీయ స్థాయి ఆటగాడు ఏ టెలికాం కంపెనీతోనూ ఒప్పందం చేసుకోకూడదు. దీంతో అతనికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకుండానే చర్యలు తీసుకొనేందుకు సిద్ధమౌతోంది. అక్టోబర్‌ 22న గ్రామీఫోన్‌ టెలికాం సంస్థకు షకీబుల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. బిసిబి చీఫ్‌ నజ్ముల్‌ హసన్‌ మాట్లాడుతూ... నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన ఏ ఒక్క క్రికెటర్‌ను ఉపేక్షించేది లేదు. మాకు షకీబుల్‌ పరిహారం చెల్లించుకోవాల్సింది. కంపెనీతో పాటు సదరు ఆటగాడు కూడా మాకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందే. దీనిపై ఇప్పటికే కంపెనీ నుంచి పరిహారం కోరుతూ లీగల్‌ నోటీసు పంపాం. షకీబుల్‌ దీనిపై వివరణ ఇవ్వాలని కోరతాం.. లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటాం' నజ్ముల్‌ శనివారం పేర్కొన్నారు. మెహదీ హసన్‌ను కూడా నజ్మల్‌ శుక్రవారం సమావేశంలోనే వార్నింగ్‌ ఇచ్చారు. ఆయన ఫోన్‌ కాల్‌ను మెహిదీ లిఫ్ట్‌ చేయకపోవడంపై సమావేశంలోనే హసన్‌ను తిట్టిపోశారు. 'ఏరు వేషాలు వేస్తున్నావా.. నీ నంబర్‌ను ఈ రోజు నుంచే నా కాంటాక్ట్స్‌ లిస్ట్‌ నుంచి తీసేస్తా. ఈ రోజు నుంచి నీ నంబర్‌ నా దగ్గర ఉండదు' అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. అదే సమయంలో మిగతా క్రికెటర్లను కూడా నజ్ముల్‌ తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది.

టీ20 జట్టు : షకీబ్‌(కెప్టెన్‌), లింటన్‌ దాస్‌, కయీస్‌, సౌమ్య సర్కార్‌, మహ్మద్‌ నయీమ్‌, ముస్తఫికర్‌ రహీమ్‌, మహ్మదుల్లా, అఫిప్‌ హొసైన్‌, ముసద్దెక్‌ హొసైన్‌, అమీనుల్‌ ఇస్లామ్‌, అరాఫత్‌ సన్నీ, అల్‌-అమిన్‌ హొసైన్‌, ముస్తఫిజుర్‌ రహ్మాన్‌, షఫివుల్‌ ఇస్లామ్‌.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD