బంగ్లా క్రికెటర్ల సమ్మె బాట

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-22 05:26:41

img

  • డోలాయమానంలో భారత పర్యటన

ఢాకా: వచ్చేనెలలో భారత్‌లో జరగాల్సిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు పర్యటన డోలాయమానంలో పడింది. జీతాల పెంపు సహా మొత్తం 11 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆ దేశ క్రికెటర్లు సమ్మె బాటపట్టారు. తమ సమ్మె నిర్ణయాన్ని బంగ్లా టెస్ట్‌, టీ20 జట్ల కెప్టెన్‌ షకీబల్‌ హసన్‌, మహ్మదుల్లా, ముష్ఫికర్‌ రహీమ్‌ సోమవారం మీర్పూర్‌లో ప్రకటించారు. భారత్‌లో బంగ్లాదేశ్‌ పర్యటన వచ్చేనెల 3న ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా 3 టీ20లు, 2 టెస్ట్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లా ఆటగాళ్ల సమ్మెతో ఈ పర్యటన జరుగుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది. జీతాలపెంపుతో పాటు, ఢాకా ప్రీమియర్‌ లీగ్‌, నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లలో ప్రాక్టీస్‌ సదుపాయాలను మెరుగుపరచాలని వారు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. ‘ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్ల మ్యాచ్‌ రుసుముతో పాటు ప్రయాణ భత్యాన్ని పెంచాలి. దేశంలో మ్యాచ్‌ల కోసం వెళ్లే ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలి’ అని షకీబల్‌ డిమాండ్‌ చేశాడు. ‘ఆటగాళ్ల సమ్మె విషయం ఇప్పుడే తెలిసింది. బోర్డులో చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తాం’ అని బంగ్లా క్రికెట్‌ బోర్డు సీఈవో నిజాముద్దీన్‌ చౌధురి చెప్పారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD