బంగ్లా క్రికెటర్ల సాధన షురూ

Mana Telangana

Mana Telangana

Author 2019-11-01 02:46:15

img

న్యూఢిల్లీ: టీమిండియా పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ క్రికెటర్లు గురువారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో సాధన మొదలు పెట్టారు. ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్ మూడు ట్వంటీ20లు, మరో రెండు టెస్టు మ్యాచుల్లో భారత్‌తో తలపడనుంది. బుధవారం భారత్ చేరిన బంగ్లాదేశ్ జట్టు ఒక రోజు విశ్రాంతి తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించింది. ఆదివారం ఢిల్లీలో భారత్‌తో తొలి ట్వంటీ20 మ్యాచ్ ఆడనుంది. కాగా, ఐసిసి నిషేధంతో స్టార్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ లేకుండానే బంగ్లాదేశ్ బరిలోకి దిగుతోంది. షకిబ్ లేక పోవడంతో బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అయితే యువ, సీనియర్ క్రికెటర్లతో కూడిన బంగ్లాను తక్కువ అంచనా వేయలేం.

రహీం, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్, మొసద్దెక్ హుస్సేన్, ముస్తఫిజుర్ రహ్మాన్ తదితరులతో బంగ్లా బలంగానే ఉంది. ఇక, భారత పిచ్‌లపై బంగ్లా క్రికెటర్లకు మంచి అవగాహనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మరోవైపు భారత జట్టు కూడా రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి లేకుండానే బరిలోకి దిగుతోంది. కోహ్లి లేకున్నా భారత్ చాలా బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మకు టి20 ఫార్మాట్‌లో కళ్లు చెదిరే రికార్డు ఉన్న విషయం తెలిసిందే.

india vs bangladesh 1st t20

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD