బంగ్లా జట్టు ప్రకటన

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-18 05:54:00

img
ఢాకా: భారత్‌తో టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం గురువారం 15 మందితో కూడి న జట్టును ఎంపికచేసింది. ఈ టీమ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల ముక్కోణపు టో ర్నీకి దూరమైన ఓపెనర్ తమీముల్ ఇక్బాల్ జట్టులోకి పునరాగమనం చేయగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ అరాఫత్ సన్నీ, పేసర్ అల్ అమీన్ హుస్సేన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో నవంబర్ 3న జరిగే తొలి మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు రాజ్‌కోట్, నాగ్‌పూర్‌లో జరుగనున్నాయి.
బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ (కెప్టెన్), తమీమ్, లిటన్ దాస్, సౌమ్యా సర్కార్, నయీమ్, ముష్ఫికర్, మహ్ముదుల్లా, అఫీఫ్, ముసద్దిక్, అమీనుల్ ఇస్లామ్, అరాఫత్, సైఫుద్దీన్, అల్ అమీన్, ముస్తఫిజుర్, షఫివుల్ ఇస్లామ్.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN