బంగ్లా జోరు… రోహిత్, ధావన్ ఔట్

Mana Telangana

Mana Telangana

Author 2019-11-10 22:24:53

img

నాగ్‌పూర్: మూడు టీ20 సిరీస్ లో భాగంగా విసిఆర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(2) రెండో ఓవర్ లోనే ఔటయ్యాడు. ఆ తర్వాత మూడు ఫోర్లతో జోరు చూపించిన మరో ఓపెనర్ శిఖర్ ధవన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. దీంతో 5.2 ఓవర్లలో 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 8 ఓవర్లలో 54 పరుగులు చేసింది. క్రీజులో కెఎల్ రాహుల్(27), శ్రేయస్ అయ్యర్(5)లు ఉన్నారు.

India lost 2 wickets at 35 runs against Bangladesh

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN