బంగ్లా టార్గెట్ 175 పరుగులు

Mana Telangana

Mana Telangana

Author 2019-11-11 00:18:56

img

నాగ్‌పూర్ : నాగ్‌పూర్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కి 175 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు నిర్దేశించింది. శ్రేయాస్ అయ్యర్‌ (62: 33 బంతుల్లో 3×4, 5×6), కేఎల్ రాహుల్ (52: 35 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆఖర్లో మనీశ్ పాండే (22 నాటౌట్: 13 బంతుల్లో 3×4) కూడా విలువైన పరుగులు చేయగా.. మరోసారి రిషబ్ పంత్ (6: 9 బంతుల్లో) ఫెయిలయ్యాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో సౌమ్య సర్కార్, సైపుల్ ఇస్లామ్ చెరో రెండు వికెట్లు తీయగా.. అల్ అమిన్ హుస్సేన్ ఒక వికెట్ పడగొట్టాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN