బంగ్లా టీ20 మ్యాచ్‌పై గంగూలీ కీలక ప్రకటన
ముంబై: టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య నవంబర్ 3న జరగాల్సిన టీ20 మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా మ్యాచ్‌కు ఇబ్బంది కలిగే అవకాశముందని.. వేరే చోట నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ కన్నా కాలుష్యమే ఢిల్లీ ప్రజల తీవ్ర సమస్యని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అన్నాడు. క్రికెట్ లేదా మరే క్రీడా పోటీకి ఆతిథ్యమివ్వడం కన్నా కాలుష్యమే ఢిల్లీ వాసులకు పెద్ద సమస్య అని లోక్‌సభ సభ్యుడు అయిన గంభీర్ ట్వీట్ చేశాడు. గంగూలీ తాజా ప్రకటనతో మ్యాచ్ నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్ వీడింది.
