బాధ్యతలు స్వీకరించిన దాదా.. కీలక వ్యాఖ్యలు..

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-23 18:00:22

img

టీమిండియా మాజీ కెప్టెన్, భారత జట్టుకు దూకుడు నేర్పిన సౌరవ్ గంగూలీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు.. ఇవాళ ముంబైలో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యత‌లు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్‌ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ముఖ్యమైన వ్యక్తి అన్న దాదా.. ప్రతి అంశంలోనూ కోహ్లీకి స‌పోర్ట్ ఇస్తానని తెలిపారు. ఇక, కోహ్లీతో రేపు మాట్లాడుతాన‌ని, అత‌నికి అన్ని విధాలా మ‌ద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కోహ్లీపై ప్రశంసలు కురిపించిన దాదా.. భార‌త జ‌ట్టును కోహ్లీ ఓ కొత్త స్థాయికి తీసుకువెళ్లాడ‌ని, అత‌నికి అండ‌గా ఉంటానని వెల్లడించారు. ఇకపై బీసీసీఐ నిర్వహ‌ణ‌లో ఎలాంటి లోపం ఉండబోదన్నారు.

మరోవైపు ముంబై ఎంతో మంది గొప్ప క్రికెటర్లను తయారు చేసిందన్నారు సౌరవ్ గంగూలీ.. ఇక, ధోనీ వ్యవహారంపై స్పందిచిన దాదా.. దేశం గర్వించదగిన విధంగా టీమిండియాకు ఎంఎస్ ధోనీ విజయాలు అందించాడని.. రిటైర్మెంట్ విషయంపై ఇంకా ధోనీతో మాట్లాడలేదని.. త్వరలోనే మాట్లాడనున్నట్టు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు బీసీసీఐకి 38 మంది అధ్యక్షులు పనిచేయగా.. సౌరవ్ గంగూలీ 39వ అధ్యక్షుడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD