బాసెల్‌ ఫైనల్స్‌కు చేరిన రోజర్‌ ఫెదరర్‌

Nava Telangana

Nava Telangana

Author 2019-10-27 13:32:00

హైదరాబాద్ : టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ బాసెల్‌ ఫైనల్స్‌కు చేరాడు. స్విస్‌ ఇండోర్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో గ్రీక్‌కి చెందిన మూడో సీడ్‌ స్టిఫానొస్‌ త్సిత్సిపాస్‌ను 6-4, 6-4 తేడాతో ఓడించడంతో రోజర్‌ ఈ సీజన్‌లో 50 విజయాన్ని అందుకొన్నాడు. 16 సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా స్విస్‌దిగ్గజం నిలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్‌ డి మినార్‌తో రోజర్‌ తలపడనున్నాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN