బీసీసీఐ బాస్‌గా గంగూలీ... కొహ్లికి కొత్త టెన్షన్ ?

News18

News18

Author 2019-10-15 12:30:26

img

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపిక కావడం దాదాపు లాంఛనమే. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ దాదాను కొత్త అవతారంలో చూస్తామని సంబరపడిపోతున్నారు. టీమిండియా కెప్టెన్‌గా ఎంతోమంది స్టార్ క్రికెటర్లు, టాలెంటెడ్ క్రికెటర్లకు అవకాశం కల్పించిన గంగూలీ... ఇండియన్ క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించారు. దీంతో బీసీసీఐ బాస్‌గానూ గంగూలీ ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. బీసీసీఐ చీఫ్‌గా ఎన్నికైతే గంగూలీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయం పక్కనపెడితే... ప్రస్తుతం టీమిండియా కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ రవిశాస్త్రికి మాత్రం ఎర్త్ పెట్టడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

రవిశాస్త్రి అంటే అస్సలు గిట్టని గంగూలీ... బీసీసీఐ బాస్‌గా ఎన్నికైన తరువాత మొట్టమొదటగా చేసే పని కూడా ఇదే అంటూ చర్చ మొదలైంది. ఒకవేళ నిజంగానే గంగూలీ రవిశాస్త్రి కోచ్ పదవికి ఎసరు పెడితే... అది టీమిండియా కెప్టెన్ కొహ్లికి పెద్ద ఎదురుదెబ్బ అనే టాక్ వినిపిస్తోంది. రవిశాస్త్రిని ఏరికోరి కోచ్‌గా తెచ్చుకున్న కొహ్లి... రెండోసారి కూడా అతడు కోచ్ అయ్యేందుకు తన వంతు సహకారం అందించాడు. అయితే తాజాగా గంగూలీ బీసీసీఐ బాస్‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుండటంతో... కొహ్లికి కొత్త టెన్షన్ పట్టుకుందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN